ఒక అనిర్వచనీయమైన అనుబంధానికి ప్రతీక. తెలిసీ తెలియని వయస్సులో యువతీ, యువకులు స్నేహంగా మాట్లాడుకున్నా దాన్ని ప్రేమగా మార్చుకుంటున్నారు. ఇలాంటి వయస్సులో ఏర్పడిన ప్రేమ కొంతకాలానికి తగ్గడంతో ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడుతున్నాయి. దీనితో యువకులు ఉన్మాదులుగా మారుతూ యువతుల నిండు జీవితాలను బలితీసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతమైన వనస్థలిపురంలో చోటు చేసుకున్న ఈ సంఘటన మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రేమకు, స్నేహానికి తేడా తెలియని వయస్సులో ఓ ప్రేమోన్మాది సృష్టించిన భయోత్పాతక ఘటన యువతుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. ఈ నెల 19న నగర శివారులో జరిగిన యథార్థ ఘటన సూర్య పాఠకుల కోసం...
నల్గొండ జిల్లా చౌటుపల్లి గ్రామానికి చెం దిన వెంకటయ్య గౌడ్ వనస్థలిహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన ముంబాయిలో వైరింగ్ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తుండగా, ఆయన భార్య పిల్లలు వనస్థలిహిల్స్‌లో ఉండేవారు. గత కొంత కాలం క్రితం మొదటి కూతురును సూర్యా పేటకు చెందిన సిఐకి ఇచ్చి వివాహం చేశారు. ఇంకా ఇద్దరు కూతుర్లు, శేఖర్ అనే అబ్బాయి ఉన్నారు. కొంత కాలం క్రితం భార్య ఇద్దరు కూతుళ్లు ముంబాయికి వెళ్లిపోయారు. అయితే కొడుకు శేఖర్ మాత్రమే వనస్థలి పురం హిల్స్‌లో ఉండి హయత్‌నగర్ మండ లం దేశ్‌ముఖ్ గ్రామంలోని విజ్ఞాన్ ఇంజనీ రింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు. అదే కళాశాలకు చెందిన బి.టెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది దివ్వ. దివ్య, శేఖర్‌ల మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది.
దివ్య తల్లిదండ్రులు కలకత్తాలో ఉంటుండంతో ఆ యువతి హబ్సిగూడ హాస్టల్‌లో ఉంటుంది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు. ప్రేమించుకున్న తర్వాత శేఖర్ ను కాదని ఆమె ప్రదీప్ అనే వ్యక్తితో చనువు గా ఉంటుండడంతో తనను కాదని మరొకరిని ప్రేమిస్తుందని భావించిన శేఖర్ ఈ నెల 19న రాత్రి 8 గంటల ప్రాంతంలో అమ్మాయికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిచి బేస్‌బాల్ స్టిక్‌తో తలపై బలంగా మోది హత్య చేశాడు. తరువాత ఆమె స్నేహితుడు ప్రదీప్‌కు దివ్యను చంపేశానని ఎస్‌ఎం ఎస్ పంపాడు. ఈ ఎస్‌ఎంఎస్ అందుకున్న ప్రదీప్ వనస్థలిపు రం పోలీసు లకు సమా చారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బిత్తర పోయారు. శేఖర్ రూంలో బీర్ బాటిళ్లు, హాల్లో ఉన్న బెడ్ మీద బ్లెండర్ సై్పడ్ బాటిల్ కవర్ ఉంది. పక్క రూంలో 50 బీర్ సీసాలు ఖాళీవి కనిపించాయి. అయినా తనంత ఉత్తముడు మరొకడు లేడన్నట్టుగా శేఖర్ పట్టుబడ్డాక మాట్లాడడం విచిత్రం. తనకు దక్కనిది మరొకరికి దక్కరాదన్న అక్కసుతో శేఖర్ ఉన్మాదంతో వ్యవహరించడమే కాక తన అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడానికి దివ్యపై నిందలు వేయడం గమనార్హం.
నల్గొండ జిల్లా చౌటుపల్లి గ్రామానికి చెం దిన వెంకటయ్య గౌడ్ వనస్థలిహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన ముంబాయిలో వైరింగ్ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తుండగా, ఆయన భార్య పిల్లలు వనస్థలిహిల్స్‌లో ఉండేవారు. గత కొంత కాలం క్రితం మొదటి కూతురును సూర్యా పేటకు చెందిన సిఐకి ఇచ్చి వివాహం చేశారు. ఇంకా ఇద్దరు కూతుర్లు, శేఖర్ అనే అబ్బాయి ఉన్నారు. కొంత కాలం క్రితం భార్య ఇద్దరు కూతుళ్లు ముంబాయికి వెళ్లిపోయారు. అయితే కొడుకు శేఖర్ మాత్రమే వనస్థలి పురం హిల్స్‌లో ఉండి హయత్‌నగర్ మండ లం దేశ్‌ముఖ్ గ్రామంలోని విజ్ఞాన్ ఇంజనీ రింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు. అదే కళాశాలకు చెందిన బి.టెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది దివ్వ. దివ్య, శేఖర్‌ల మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది.
ప్రేమించానంది... కాదు పొమ్మంది... అందుకే హతమార్చా: శేఖర్
శేఖర్‌కు జూనియర్‌గా కళాశాలలో చేరిన దివ్యతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్యా పరిచయం సన్నిహితంగా మారడంతో ప్రేమ ను వ్యక్తం చేసుకున్నారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొంత గొడవ పడ్డా ఆ తరువాత చర్చించుకుని మళ్ళీ ఒక్కటయ్యారు. ఇదిలా ఉండగా దివ్య పాఠశాల స్నేహితుడు ప్రదీప్ కుమార్‌తో సన్నిహితంగా మెలగుతోందని శేఖర్‌కు అనుమానం వచ్చింది. పలుమార్లు ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకునేది. హత్య జరిగిన రోజు ఇదే విషయాన్ని చర్చించేందుకు దివ్యను శేఖర్ తన గదికి ఆహ్వానించాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా దివ్య సెల్‌కు ప్రదీప్ నుండి మెసేజ్ రావడంతో ఆగ్రహించిన శేఖర్ పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌తో దివ్య తలపై బలంగా మోదాడు. దీంతో తలకు బలమైన గాయమైన దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతి చెందిన విషయాన్ని నిర్ధారించుకున్న శేఖర్ తన గదికి తాళం వేసి దివ్యను చంపానని, తాను ఆత్మహత్య చేసుకో బోతున్నానని స్నేహితులకు ఎస్‌ఎంఎస్ పంపించి ముంబాయికి పారిపోయాడు. అక్కడి నుండి తిరిగి నగరానికి చేరుకోవడంతో శేఖర్ వేటలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితురాలే ప్రియురాలైంది...
అతి తక్కువ కాలంలోనే తమ మధ్య స్నేహం ప్రేమగా మారిందని శేఖర్ చెప్తున్నాడు. ప్రదీప్ తో పరిచయం ఏర్పడిన తరువాత మెల్లగా దూరం కావడం ప్రారంభించింది. భావోద్వేగంతో పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసి హత్య చేసినట్టు శేఖర్ తన పనిని సమర్ధించుకుంటున్నాడు. చేసిన తప్పుకు తాను చనిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ తల్లిద ండ్రులు గుర్తుకు రావడంతో వెనక్కి తగ్గినట్టు చెప్పిన శేఖర్ దివ్య విషయంలో అలా ఆలోచించకపోవడం విషాదం.- తాళాల శ్రీనివాసశర్మ,
స్టేట్ క్రైమ్‌బ్యూరో ఇంఛార్జి

0 comments:
Post a Comment