మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అల్లుడు బుద్ధిమంతుడనీ, కట్నకానుకలు ఇచ్చి పెళ్ళి చేసినా కూతురు అత్తవారింట కాపురం చేయలేదు. తాము చెల్లించిన డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులు పథకం ్రపకారం బావను హతమార్చిన సంఘటన రాజధాని నడిబొడ్డున జరిగింది. అదీ అత్యంత ఉన్నత వర్గాలు నివసించే బేగంపేట్ ప్రాంతంలో ఇటీవలే ఈ సంఘటన చోటు చేసుకుంది. వివాహ సంబంధాలు సైతం హత్యలకు దారితీస్తున్న వైనంపై ప్రత్యేక కథనం. యథార్థ సంఘటన సూర్య పాఠకుల కోసం...
కుటుంబ కలహాలతో వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి హతమార్చిన సంఘటన బేగంపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 4న రాత్రి చోటుచేసుకుంది. అత్యంత జనసంచారం ఉండే ప్రాంతంలో రోడ్డుపై ఈ హత్య జరగడంతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. సంచలనం సృష్టించిన దారుణ హత్యకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. పి.ఎస్ మక్తా ప్రాం తానికి చెందిన హనీఫ్ (34) బేగంపేట్ శాంబా గ్ బిల్డింగ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు ఎదురుగా ఫాస్ట్‌ఫుట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. గత మూడు నెలల క్రితం బోరబండ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది.
కుటుంబ కలహాల కారణం చేత హనీఫ్ భార్య ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ నెల 4న ఎప్పటిలేగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్న హనీఫ్ వద్దకు రాత్రి పది గంటల ప్రాంతంలో నలుగు రు వ్యక్తులు సమీపించి మారణాయుధాలతో అత్యంత దారుణంగా నరికి హతమార్చా రు. హనీఫ్‌పై దాడి చేసి హతమార్చిన వారు భార్య తరపు బందువులై ఉంటార న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హనీఫ్‌ను హతమార్చింది అతని బంధువు లేనని తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టారు.
అసలేం జరిగింది...
ఈనెల 4వ తేదీన బేగంపేట్ శ్యాంలాల్ బిల్డింగ్‌లో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని డాగర్లతో విచాక్షణ రహితంగా హత్య చేసిన 6 మంది హంతకులను బేగంపేట్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి డాగర్లు, షాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నార్త్ జోన్ డీపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యా వివరా లను నార్త్ జోన్ డీసీపీ వై. నాగిరెడ్డి, బేగంపేట్ ఇన్‌ప్పెక్టర్ ఏ. యాదగిరిలు వివరించారు. బి.ఎస్ మక్తా ప్రాంతానికి చెంది న మహ్మద్ హనీఫ్‌తో బోరబండ ప్రాంతానికి చెందిన సుర్యాబేగంకు పెద్దల సమక్షంలో 2010 ఏప్రిల్‌లో వివాహం జరిగింది. కట్నం కానుకుల కింద హనీఫ్‌కు లక్ష రూపాయలు, 5 తులాల బంగారం, ఫర్నిచర్ తదితర వస్తు సామాగ్రిని అందజేశారు.
పెళె్ళైన నాటి నుండి సూరబేగంను భర్త హనీఫ్ శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మానసి కబాధ భరించలేక సూరబేగం పుట్టినిళె్ళైన బోరబండకు వచ్చి ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపుల కారణంగా మృతి చెందిందంటూ భర్త హనీఫ్, మామ మహ్మద్ యుసుఫ్, అత్త ఫాతిమాబీలపై ఎస్.ఆర్ నగర్ పోలీసుస్టేషన్ లో సురాబేగం సోదరులు కేసు నమోదు చేశారు. దీంతో ముగ్గురు జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చారు. అప్పటి నుండి బేగంపేట్ శ్యాంలాల్ బిల్డింగ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంపు దగ్గర ఫాస్ట్‌ఫుడ్ సెంట ర్‌ను హనీఫ్ నిర్వహిస్తున్నాడు. సోదరి మృతికి కారణమైన హనీఫ్‌ను ఏలాగైన మట్టుపెట్టాలని బేగం సోదరులు కసి పెంచుకున్నారు.
హత్యకు వ్యూహం ఇలా...
రెండు ఆటోలలో మృతురాలి సోదరులు అక్రమ్‌ఖాన్, ముకారంఖాన్‌లతో పాటు వారి సోదరులు షేక్‌గౌస్, మహ్మద్ జహంగీర్, మహ్మద్‌సలీం, ముక్విముద్దీన్, ఇమ్రాన్, బాబా, నజీర్, హఫీజ్, గౌస్, జమీల్‌లు బేగంపేట్ శ్యాంలాల్‌బిల్డింగ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న హనీఫ్ దగ్గరకు రాత్రి 9:40 గంటలకు చేరుకున్నారు. ఇందులో ఏడుగురు మారణాయుధాలు ధరించగా, మిగతా వారు ఆటోలలో ఉన్నారు. మరణాయుధాలు ధరించిన ఏడుగురు హనీఫ్‌ను విచాక్షణ రహితంగా జనం మద్యనే హత్య చేశారు. ఇది గమనించిన మృతుడి తండ్రి ఎంత ప్రాధేయపడిన వారు వినిపించుకోకుండా అతన్ని కూడా గాయపరిచి వెళ్లిపోయారు. సగం దూరం పోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆటోలలో వెళ్లిపోయారు.
ఆరుగురు రిమాండ్, మరో ఆరుగురుపరారీ...
హనీఫ్‌ను హత్య చేసిన 12 మంది నిందితులలో ఆరుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్రమ్‌ఖాన్, ముకారంఖాన్, షేక్‌గౌస్, జహంగీర్, మహ్మద్ సలీం అహ్మద్, సయద్ ముక్వినోద్దీన్‌లు ఉన్నారు. ఇమ్రాన్, బాబా, నసీర్, హఫీజ్, గౌస్, జమీల్‌లు పరారీలో ఉన్నారు.
- తాళాల శ్రీనివాసశర్మ, స్టేట్ క్రైమ్‌బ్యూరో ఇంఛార్జి

0 comments:
Post a Comment