Hello Guest! Welcome to our Website.
Something you might want to know about us.
Don't be hesitated to contact us if you have something to say.

ఇతడే నేరస్థుడు

| |
|


‘‘ఈ ఫోటో చూడండి. ఇతడే అసలు హంతకుడు. వీడే చంపాడు. వీడి పేరు దావూద్‌. నేను ఇతడు చంపుతుండగా నా రెండు కళ్ళతో చూశాను. అధికారుల అందరి మధ్య ఒక ఫోటో చూపించి మరీ చెప్పాడు హత్యను కళ్ళారా చూసిన శిశిర్‌ గుప్తా. టేబుల్‌ మీద పడేసిన చాలా ఫోటోల్లో ఒక ఫోటో ఎంపిక చేశాడు. అధికారులు అంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మిగిలిన సాక్షులకు ఆ ఫోటో చూపించారు. వారు ఆ ఫోటోని చూసి ‘‘సార్‌ వీడే మేం చూస్తుండగా చంపేశాడు’’ అని చెప్పారు. సాక్షులు అంతా కలిసి ఆరుగురు అక్కడ ఒకే మాట మీద ఉన్నామన్నట్టుగా చెప్పారు. వారిని పక్క గదిలోకి పంపించేసి అధికారులు తొలు త తలలు పట్టుకున్నారు. అంతా ఫోటోను చూసి వీడు మన కస్టడీలో ఉన్నాడు. బయటికి పోకుండా దాచాం. మరి వీడు చంపాడని చెబుతు న్నారు. ఎట్టి పరిస్థితు ల్లో కూడా వీడు మన నుంచి తప్పించుకొని వెళ్ళి చంపలేడు. మరెందుకు చెబుతున్నారు ఈ సాక్షులు. అలా ఎవరికి వారే ఆలోచించా రు. ఇందులో ఏదో గూడుపుఠానీ నడుస్తోంది.

పక్క గదిలో సాక్షులను అప్పటికి పంపేసి దావూద్‌ గురించి మళ్ళీ ఆలోచించారు. వాడు చాలా ప్రమాదకారి. అందుకే వాడిని పోలీ సులు తమ గుప్పిట్లో పెట్టి ఉంచారు. పలు కేసుల్లో వాడికి లింకులున్నందున వాడిన వదలకుండా అరెస్టు చేసినట్లు చూపకుండా ఒక చోట దాచారు. అయితే అక్కడ అతడు అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రహస్యంగా చికిత్స జరిపిస్తే... రెస్టు అవసర మని డాక్టర్‌ చెప్పడంతో అలా ఒక సెల్‌లోనే పటిష్టమైన కాపలాతో ఉంచారు. అలాంటి దావూద్‌ ఎలా నగరం నడిబొడ్డున హత్య చేస్తా డు. సాక్షులు కావాలనే చెబుతున్నారు. వీరి వెనుక ఎవరో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఆలోచనలో పడ్డారు.
సాక్షులు ఈ సరికే మీడియాకు చెప్పేయడం తో మీడియా వారు పోలీస్‌ కార్యాలయానికి వచ్చేశారు. ఇక చేసేదేం లేక ‘‘పలు కేసుల్లో నిందితుడై ఉండి కూడా తప్పించుకుని తిరుగుతూ అప్పుడప్పుడు ఇలా కిరాయి హత్యలు చేస్తున్నాడు. అతడి ఫోటోనే ఇది’’ అని మీడియాకు చూపించి చేతులు దులుపుకున్నారు పోలీస్‌ అధికారులు.

ఎక్కడ చూసినా దావూద్‌ గురించి అనుకోవడం పై పత్రికలలో మరింతగా చిలవలు పలవలుగా రావడంతో దావూద్‌కు రహస్యంగా చికిత్స చేస్తున్న డాక్టర్‌ రేమాండ్‌ జాన్‌ ఆ రోజు తన కారులో దావూద్‌ ఉండే చోటుకు వెళ్ళాడు. అక్కడ సివిల్‌ డ్రస్సులు వేసుకొని ఉన్న పోలీసులు డాక్టర్‌ను దావూద్‌ గదిలోకి పంపారు. అక్కడ దావూద్‌ కొంతవరకు కోలు కున్నా ఆ రోజు చిరాగ్గా ఉన్నాడు.
‘‘సార్‌! నా రోగానికి మీరిచ్చే మందులు ఎలాంటివి? ఏదో ఫర్వాలేదు అనేట్టున్నాను. ఖరీదైనవి మీరు భరించి నాకు ఇవ్వండి. నేను కోలుకోగానే మీకు ఎంత కోరితే అంత ఇవ్వగలను’’ అని చేతులు పట్టుకున్నాడు.
‘‘ఎందుకు చిరాగ్గా ఉన్నావు?’’ అని అడిగాడు డాక్టర్‌.
‘‘నాకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నా ముందు టీవీ ఉండేది. అది నిన్నటినుండి పనిచేయడం లేదు. పత్రికలు ఇచ్చేవారూ ఇవ్వడం మానుకు న్నారు. అసలేం జరుగుతోంది. నాకు తెలి యకుండా ఏదేదో జరిగిపోతోంది’’ కోపంతో ఊగిపోయాడు.

‘‘దావూద్‌... నీ గురించి పత్రికల్లో అచ్చయింది. ఇదిగో పత్రిక క్లిప్పింగ్‌’’ అని చేతిలో పెట్టాడు డాక్టర్‌. అది ఆత్రంగా చదివి... పేలవంగా నవ్వాడు. ‘‘డాక్టర్‌... నేను సుస్తీగా ఉన్నందువల్ల పోలీసులు నన్ను పటు ్టకోగలిగారు. ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో? బయట కాపలాగా ఉన్నవారికి అమ్మే శారు. బహుశా నాలాంటి క్రిమినల్స్‌ అయి ఉంటారు. నాకు చికిత్స చేయించి నా ద్వారా ఏవో పనులు చేయించుకోవాలనుకుంటు న్నారు. అలాంటివి ముఠాల మధ్య జరిగేవే. మరోవైపు పోలీసులు నామీద మరో హత్య కేసు బనాయించారు.’’
‘‘ఏమిటి పోలీసులు పట్టుకొని క్రిమినల్స్‌కి అమ్మేశారా?’’
‘‘ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. నన్ను పట్టుకున్న ఏ ఠాణాకు చెందిన పోలీసు లో... డబ్బు ఆశతో ఏ తొట్టి గ్యాంగ్‌కో అమ్మే శారు. నాకోసం మరోవైపు పోలీసులు వెదుకుతున్నారు. ఎవడో చేసిన ఖూనీ కేసు ఒకటి ఇప్పుడు నామీద బనాయించారు. నేను మూడు నెలలుగా మంచం పట్టి ఉన్నాను.’’

డాక్టర్‌కు అప్పుడు అర్థం అయ్యింది. చేయాల్సిన పరీక్షలు చేస్తుండగా... డాక్టర్‌ నన్ను ఇక్కడినుండి తప్పించగలిగితే నీకు లలు ఇస్తాను. ఎలా అనేది నేను చెబు తాను. నాకు ఒంట్లో బాగులేదు అని చెప్పి రోజుకు రెండు పూటలా వచ్చి వెడుతుండు. నేను నీకు రెండు సెల్‌ నెంబర్లు ఇస్తాను. వారికి నా ఉనికి చెప్పు. వారు వేకువజామున దాడి చేసి నన్ను తీసుకుపోతారు. నీకు, ఉదయానికి లక్షలు ఇస్తాను.’’
డాక్టర్‌ ఆత్రంగా చూశాడు. ఆ వెంటనే సెల్‌ నెంబర్లు చెబితే నోటు చేసుకున్నాడు. ‘‘ఒకవేళ ఈ రెండు నెంబర్లు నాకు తగలకపోతే ఏం చేయాలి?’’

దావూద్‌ మరి నాలుగు నెంబర్లు చెప్పాడు. నోటు చేసుకొని లేచాడు. అప్పుడు వెళ్ళి పోతున్న డాక్టర్‌ను పిలిచి... ‘‘డాక్టర్‌ నాకు పిచ్చిపట్టకుండా ఉండడానికి టీవీకి కనెక్షన్‌ ఇప్పించమని చెప్పండి. అలాగే పత్రికలు వేయమనండి.

మరుసటిరోజు డాక్టర్‌ వచ్చి ‘‘సారీ దావూద్‌ నీ నెంబర్లు ఏవీ పనిచేయట్లేదు. డాక్టర్‌గా నేను సంపాదించుకోలేకపోయాను. కానీ, నీవు ఇస్తా నన్న లక్షల రూపాలయలపై ఆశతో ఉన్నాను. ఒక పనిచేయ్‌. ఈ నెంబర్లు వదిలేసి ఇంకా నీకోసం ప్రాణాలిచ్చే గ్యాంగ్‌ వారి అడ్రసులు ఇవ్వు. నేరుగా కలుస్తాను. ఇదొక్కటే మార్గం. తీరా పనయ్యాక నాకు మొండిచెయ్యి చూపవు కదా!’’ అనుమానంగా అడిగాడు.
దావూద్‌ కొన్ని అడ్రసులు చెప్పాడు. ఆ మరుసటి రోజు డాక్టర్‌ వచ్చి ‘‘ఆ చిరు నామాలో ఒక్కరు కూడా లేరు. నీవు అనారోగ్యం కారణంగా తప్పు చెప్పావు. నావంతు నేను చేశాను. కానీ, నీవు సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పినా ఫలితం లేక పోయింది’’ భారంగా లేచి నిలబడ్డాడు డాక్టర్‌.

దావూద్‌ ముఖం వేలాడేసుకొని నిట్టూర్చాడు. అప్పుడు ఎదురుగా ఉన్న టీవీ పనిచేయసాగింది. అందులో ‘నగరంలో దావూద్‌ గ్యాంగ్‌ మనుష్యులను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆరుగురు. చిరునామాల ఆధారంగా పదిమంది వరకు దొరికిపోయారు. దావూద్‌ కోసం పోలీసులు వెదుకుతున్నారు’ అని యాంకర్‌ చెబుతుంటే... విజువల్స్‌లో మొత్తం గ్యాంగ్‌వారిని, పోలీసు అధికారుల బైట్స్‌ను చూపారు.

దావూద్‌, డాక్టర్‌ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దావూద్‌ కళ్ళు ఆ గదిని వెదికాయి. నెత్తిమీద రూఫ్‌ను అంటుకుని ఉన్న లైట్‌ పక్కనే వెలగని లైట్‌ స్థానంలో చిన్న కెమెరా కనిపించింది. బయటున్నవారు క్రిమినల్స్‌ కారు పోలీసులే అని అప్పుడు తెలుసుకొని నాలుక కరుచుకున్నాడు. పోలీసుల వలకు తాను దొరికిపోయినందుకు కణతలు నొక్కుకున్నాడు.
- యర్నాగుల సుధాకరరావు,
సెల్‌: 99852 65313



0 comments:

Post a Comment

 

Followers